భారతదేశం, అక్టోబర్ 5 -- Mandaadi OTT: తమిళ నటుడు సూరి, టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సుహాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'మండాడి' (Mandaadi). ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

థియేటర్లలో సంచలన విజయం సాధించి ఏకంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన 'మండాడి' డిజిటల్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అక్టోబర్ 8, 2026 నుంచి ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (అక్టోబర్ 5) ప్రకటించింది.

తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం...