భారతదేశం, మే 26 -- Manchu Manoj: సినిమాల్లో విలక్షణమైన నటనతో మెప్పించడమే కాకుండా నిజ జీవితంలోనూ మంచి మనసుతో రియల్ హీరోగా నిలుస్తున్నాడు మంచు మనోజ్. సినీ పరిశ్రమలో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్.. నిజ జీవితంలోనూ తన ఉదారతను చాటుకున్నాడు. తాజాగా అతని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సమాజంలో అణగారిన, నిరుపేద ప్రజలకు సహాయం చేయడానికి మంచు మనోజ్ ఎల్లప్పుడూ ముందుంటాడు. ఇందులో భాగంగానే, తాజాగా ఆయన చేపట్టిన ఒక సేవా కార్యక్రమం సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ​ఇటీవల ప్రారంభమైన 'సెలబ్రిటీ రీబర్త్ ఛాలెంజ్' (Celebrity Rebirth Challenge) లో మంచు మనో పాల్గొన్నాడు.

ఈ సెలబ్రిటీ రీబర్త్ ఛాలెంజ్ అనే వినూత్న సవాల్‌ను స్వీకరించిన మంచు మనోజ్ ఒక అనాథకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించాడు. హైదరాబాద్ నగరంలోని...