భారతదేశం, మే 31 -- Manchu Manoj Comments On Dasari Narayana Rao At Ghat: తెలుగు దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను హీరో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్, ఆయన స‌తీమ‌ణి భూమా మౌనిక‌తో క‌లిసి సంద‌ర్శించారు.

ఈ క్ర‌మంలో దాస‌రి ఘాట్ దుస్థితిపై యాంక‌ర్ గౌత‌మి షేర్ చేసిన వీడియోపై మ‌నోజ్ రియాక్ట్ కావ‌ట‌మే కాకుండా స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమ‌ను చాటుకున్నారు మంచు మనోజ్. ఈ సంద‌ర్భంగా మంచు మనోజ్ ఇంట్రెస్టంగ్ కామెంట్స్ చేశారు

మంచు మ‌నోజ్ మాట్లాడుతూ.. "ఈరోజు మ‌న గురువు గారు దాస‌రి నారాయ‌ణ‌రావు గారి వర్ధంతి. నిజానికి ఈరోజు ఆయ‌న వ‌ర్ధంతి అనే విష‌యం నాకు గుర్తు లేదు. నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాల‌నీ వైపు వ‌స్తుంటే, గురువు గారి విగ్ర‌హ...