భారతదేశం, ఆగస్టు 15 -- Manasa Varanasi: పబ్లిక్ ప్లేస్ ల్లో సెలబ్రిటీలు కనపడితే చాలు జనాలు ఎగబడిపోతున్నారు. ఫొటోలు, వీడియోలంటూ తోసేసుకుంటున్నారు. షాపింగ్ మాల్స్, షూటింగ్ స్పాట్స్ పక్కనపెడితే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలోనూ ఇదే పద్ధతి కనిపిస్తోంది. తాజాగా తిరుమలలో టాలీవుడ్ హీరోయిన్ మానస వారణాసికి ఇలాంటి షాకింగ్ సంఘటనే ఎదురైంది.

అందంతో పాటు అభినయంతోనూ అలరించే టాలీవుడ్ హీరోయిన్ మానస వారణాసి రీసెంట్ గా తిరుమలకు వెళ్లింది. ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అయితే బయటకు వచ్చిన తర్వాత మాత్రం మానస వారణాసికి ఊహించిన సంఘటన ఎదురైంది. ఆమెతో సెల్ఫీలు తీసుకోవడం కోసం జనాలు ఎగబడ్డారు.

గుడి బయట మానస వారణాసిని చూసిన జనాలు ఆమెతో సెల్ఫీల కోసం చుట్టుముట్టేశారు. ఇందులో సేవకులు కూడా ఉండటం గమనార్హం. మానసతో ఫొటో తీసుకోవడం కోసం ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడ...