భారతదేశం, అక్టోబర్ 4 -- Mamitha Baiju OTT: 'ప్రేమలు' చిత్రంతో సౌత్ ఇండియాలో క్రేజ్ సంపాదించుకున్న మమితా బైజు (Mamitha Baiju) ఫుల్ స్పీడ్ మీదుంది. ఒకే సమయంలో నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5 డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆమె నటించిన సినిమాలు నంబర్ 1 పొజిషన్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ 'ట్రిపుల్ విన్' సాధించి అరుదైన రికార్డును మమితా ఖాతాలో వేసుకుంది.

సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons) ఓటీటీని షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 11న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. డిజిటల్ ప్రీమియర్ అయినప్పటి నుంచి టాప్ 10 జాబితాలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న ఈ చిత్రం, ఇప్పుడు మళ్లీ ఇండియా లెవెల్లో నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకోవడం విశేషం.

మరోవైపు మమితా బైజు, నివిన్ పౌలీ కాంబి...