భారతదేశం, సెప్టెంబర్ 6 -- తెలుగు, తమిళ్, మలయాళం.. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా ఒక పేరు మాత్రం బాగా వినిపిస్తోంది. అదే.. 'మమితా బైజు'! దక్షిణాది చిత్రసీమలో తన క్యూట్ లుక్స్, నటనతో కుర్రకారు మనసు దోచుకుంటోంది ఈ 'ప్రేమలు' బ్యూటీ. ఈ నేపథ్యంలో మమితా బైజు నెట్​ వర్త్​కి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. 25ఏళ్లకే ఆమె సంపద రూ. 30కోట్లు అట!

కేవలం 25 ఏళ్ల వయస్సులోనే సౌత్ ఇండియాలోని క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన మమితా బైజు.. నటనతో పాటు తన ఆర్థిక సంపాదనతోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2016లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'పావడ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన మమితా, ఆ తర్వాత 'ఆపరేషన్ జావా', 'వరతన్', 'కర్ణా', 'రెబెల్' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

'ప్రేమలు' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన తర్వాత...