భారతదేశం, జూలై 20 -- Mamita Baiju: 'ప్రేమలు' సినిమాతో సౌత్ ఇండియా అంతటా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అరుదైన హిస్టారికల్ మైల్‌స్టోన్‌ను క్రియేట్ చేయడానికి రెడీ అయింది. కేవలం 30 రోజుల గ్యాప్‌లోనే మూడు వేర్వేరు భాషల్లో మూడు భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు వస్తోంది. యంగ్ జనరేషన్ హీరోయిన్లలో ఇంత తక్కువ టైమ్‌లో ఇలాంటి అరుదైన ఫీట్ సాధించిన వారు చాలా అరుదుగా ఉంటారు.

ఈ క్రేజీ జర్నీలో మొదటిది కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ లీడ్ రోల్ ప్లే చేసిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' (తెలుగులో జననాయకుడు). ఎన్నో వాయిదాల తర్వాత ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈ గురువారమే అంటే జులై 23న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.

దళపతి విజయ్ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ...