భారతదేశం, అక్టోబర్ 17 -- Malayalam Top OTT: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో మలయాళ చిత్రాలకు, వెబ్ సిరీస్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో మలయాళ మేకర్స్ చూపిస్తున్న నైపుణ్యం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అలాంటి టాప్ 5 థ్రిల్లర్లను చూసేయండి. ఇవన్నీ ఒకే ఓటీటీ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇది జియోహాట్‌స్టార్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించిన ఒక అద్భుతమైన మలయాళ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఓటీటీలో దీనికి ఫ్యాన్స్ చాలా మంది.

* కథ & ట్విస్ట్‌లు: మొదటి సీజన్ లో ఒక లాడ్జ్‌లో జరిగే లతిక అనే సెక్స్ వర్కర్ హత్య కేసు చుట్టూ తిరుగుతుంది. అక్కడ రిజిస్టర్‌లో ఉన్న ఫేక్ అడ్రస్ 'షిజు, పరయిల్ వీడు, నీండకర' అనే ఒకే ఒక్క క్లూతో పోలీసులు హంతకుడిని ఎలా పట్టుకున్నారనేది కథ. రెండవ సీజన్ లో ఒక పోలీస్ ...