భారతదేశం, అక్టోబర్ 16 -- Malayalam Thriller: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కు ఓటీటీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అదే కోవలో ఈరోజు అంటే శుక్రవారం (అక్టోబర్ 16) ఓటీటీలోకి వచ్చిన మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'ఒరు అన్వేషణతింటే తుడక్కమ్' (Oru Anweshanathinte Thudakkam) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

దర్శకుడు ఎంఏ నిషాద్ తన తండ్రి, దివంగత DIG పి.ఎం. కుంజుమొయినుద్దీన్ కుట్టి కేస్ డైరీల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథను తెరకెక్కించారు. రియలిస్టిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. కొట్టాయం క్రైమ్ బ్రాంచ్ అధికారుల చేతికి చిక్కిన ఒక మిస్సింగ్ కేస్, దాని వెనుక ఉన్న ఊహించని నిజాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది...