భారతదేశం, నవంబర్ 2 -- Malayalam Thriller: సోనీ లివ్ (SonyLIV) ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న తాజా మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఐస్' (Eyes). మహిళలను వెంబడించడం (స్టాకింగ్), ప్రేమ పేరుతో వారిపై అకృత్యాలకు పాల్పడటం వంటి నేరాలను అరికట్టేందుకు ఒక ఐదుగురు సభ్యుల బృందం చేసే పోరాటమే ఈ సిరీస్ కథాంశం.

నేరస్థులను పర్యవేక్షించి, వారి ప్రొఫైల్స్ తయారు చేసి, క్రైమ్ జరగకముందే ఆపేందుకు 'ఐస్' అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఈ బృందం ఉపయోగిస్తుంది. ఇందులో పోలీస్ అధికారులు టీనా, జస్టిన్; సాఫ్ట్‌వేర్ డెవలపర్ విద్య; మానసిక ఆరోగ్య నిపుణులు ఆయేషా, తన్వి సభ్యులుగా ఉంటారు.

ఒక హీరోయిన్‌ను వెంబడించే ఫోటోగ్రాఫర్, సూపర్ మార్కెట్ ఉద్యోగిని వేధించే ప్రియుడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ శాడిజం, పారిపోయి పెళ్లి చేసుకున్న ఒక యువతి ఎదుర్కొనే గృహహింస.. ఈ నాలుగు కేసుల చుట్టూ కథ ఉత్కంఠభరితంగా స...