భారతదేశం, మార్చి 23 -- దృశ్యం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రముఖ మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ తీసిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ వలతు వశతె కల్లన్ (Valathu Vashathe Kallan). దీనర్థం కుడివైపున ఉన్న దొంగ అని. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల లోపే ఇది డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీదకు వస్తుండటం విశేషం. బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 27న మనోరమ మాక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మోహన్‌లాల్ నటిస్తున్న దృశ్యం 3 థియేటర్లలోకి రావడానికి సరిగ్గా వారం ముందు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోంది.
ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లలోకి వచ్చిన వలతు వశతె కల్లన్ అనే ఈ సినిమా ఈ శుక్రవారం (మార్చి 27) నుంచి మనోరమ మాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ ప్లాట్‌ఫామ్ లో ఉన్న మిగతా సినిమాల్లాగే, దీన్ని కూడా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.