భారతదేశం, మార్చి 23 -- దృశ్యం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రముఖ మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ తీసిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ వలతు వశతె కల్లన్ (Valathu Vashathe Kallan). దీనర్థం కుడివైపున ఉన్న దొంగ అని. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల లోపే ఇది డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీదకు వస్తుండటం విశేషం. బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 27న మనోరమ మాక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మోహన్‌లాల్ నటిస్తున్న దృశ్యం 3 థియేటర్లలోకి రావడానికి సరిగ్గా వారం ముందు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోంది.

ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లలోకి వచ్చిన వలతు వశతె కల్లన్ అనే ఈ సినిమా ఈ శుక్రవారం (మార్చి 27) నుంచి మనోరమ మాక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ ప్లాట్‌ఫామ్ లో ఉన్న మిగతా సినిమాల్లాగే, దీన్ని కూడా ...