భారతదేశం, జూన్ 20 -- Malayalam OTT This Week: వైవిధ్యమైన కథలు, సహజసిద్ధమైన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమ భారతీయ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందుకే మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టే ఈ వారం ప్రముఖ ఓటీటీ వేదికల్లో నాలుగు సరికొత్త మలయాళ సినిమాలు సందడి చేస్తున్నాయి.

తారాగణం: మోహన్‌లాల్, మీనా, సిద్ధిక్, ఆశా శరత్

దర్శకత్వం: జీతూ జోసెఫ్

కథాంశం: భారతీయ చలనచిత్ర రంగాన్నే ఊపేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం' నుంచి వచ్చిన మూడో భాగం ఇది. థియేటర్లలో దాదాపు రూ.330 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లతో సంచలనం సృష్టించిన దృశ్యం 3 ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్‌ కుట్టి (మోహన్‌లాల్) మైండ్ గేమ్స్, పోల...