భారతదేశం, అక్టోబర్ 11 -- Malayalam OTT: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఒరు అన్వేషణథింతె తుడక్కం' (Oru Anveshanathinte Thudakkam). ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. సస్పెన్స్, క్రైమ్ కథలను ఇష్టపడే సినీ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకోనుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ లో ఈ ఒరు అన్వేషణథింతె తుడక్కం సినిమా అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేకపోయిన వారు అలాగే మంచి మలయాళ థ్రిల్లర్లను ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఒరు అన్వేషణథింతె తుడక్కం సినిమా కథ మొత్తం ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. జీవన్ థామస్ అనే జర్నలిస్ట్ హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో మీడియా, పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం ర...