భారతదేశం, జూలై 22 -- Malayalam OTT: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో మలయాళ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు, అద్భుతమైన నిర్మాణ విలువలతో మలయాళ ఇండస్ట్రీ డిజిటల్ వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ క్రమంలోనే జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్ రీసెంట్‌గా రెండు భిన్నమైన జోనర్లకు చెందిన మలయాళ సిరీస్‌లను అందుబాటులోకి తెచ్చింది.

ముత్తస్సి (Muthassi): ఒక కుటుంబం, వారిని వెంటాడే ప్రాచీన శాపం, దాని వెనుక ఉన్న భయానక రహస్యం చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఒకే కంటిన్యూటీతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. కేరళ జానపద నమ్మకాలను హారర్ థ్రిల్లర్ అంశాలతో ముడిపెట్టి కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.

మనోరధంగల్ (Manorathangal): ఇది ఒక ఆంథాలజీ సిరీస్. ప్రముఖ మలయాళ సాహిత్య దిగ్గజం ఎం...