భారతదేశం, మే 11 -- Malayalam OTT: బాక్సాఫీస్ వద్ద మంచి వినోదాన్ని పంచిన మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ 'మధువిధు' (Madhuvidhu) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ (Sony LIV) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ఖరారు చేసింది.

షరాఫుద్దీన్, కల్యాణి పణిక్కర్ జంటగా నటించిన ఈ క్యూట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఇందులో ఉన్న కామెడీ టైమింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

కేవలం మలయాళంలోనే కాకుండా ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సోనీ లివ్ అందుబాటులోకి తెస్తోంది. భాషా భేదం లేకుండ...