భారతదేశం, అక్టోబర్ 9 -- Malayalam OTT: సినిమా ప్రియులకు అదిరిపోయే వినోదాన్ని పంచేందుకు మలయాళం నుంచి మూడు మైండ్ బ్లోయింగ్ కంటెంట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టాయి. ఇందులో రెండు విభిన్నమైన క్రైమ్ & యాక్షన్ సినిమాలు, ఒక మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో హైప్ క్రియేట్ చేసిన ఆ మూడు మలయాళ రిలీజ్ లు ఇవే.

యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చి, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేస్తోంది. ఇవాళ (అక్టోబర్ 9) ఒకేసారి ఏకంగా ఏడు ఓటీటీల్లో రిలీజైంది. ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, మనోరమా మ్యాక్స్, లయన్స్ గేట్ ప్లే, సింప్లీ సౌత్, స్టార్జ్ ప్లే, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఖలీఫా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింద...