భారతదేశం, ఫిబ్రవరి 26 -- భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా ఎల్లలు చెరిగిపోయాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటులు కీలక పాత్రలు పోషించడం సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటి సమయంలో ఒక ప్రతిభావంతురాలైన నటి "నన్ను మీ సినిమాల్లో తీసుకోకండి" అని బాలీవుడ్ దర్శకులను కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె మరెవరో కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మలయాళ పాపులర్ నటి కని కుస్రుతి.

పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన కని కుస్రుతి లేటెస్ట్‌గా అనుభవ్ సిన్హా తెరకెక్కించిన 'అస్సీ' (Assi) చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను "మీకు హిందీలో ఎక్కువ అవకాశాలు ఎందుకు రావడం లేదు?" అని ప్రశ్నించగా కని కుస్రుతి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

"నిజం చెప్పాలంటే నా...