భారతదేశం, మే 29 -- Malaika Arora About Internet Noise And Trolling: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫిట్‌నెస్‌కు, గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హాట్ బ్యూటీ మలైకా అరోరా నిరంతరం వార్తల్లో ఉంటారు. అర్బాజ్ ఖాన్‌తో విడాకుల నుంచి మొదలుకొని, యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం, ఇటీవలి బ్రేకప్ వరకు ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది.

దీనికి తోడు మలైకా అరోరా వేసుకునే బోల్డ్ దుస్తులపై నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు దిగుతుంటారు. బాలీవుడ్‌లో అత్యధికంగా బాడీ షేమింగ్, వయసు రీత్యా విమర్శలు ఎదుర్కొనే సెలబ్రిటీలలో మలైకా ఒకరు. ఇలాంటి నిరంతర నెగెటివిటీని, ఆన్‌లైన్ వేధింపులను తానెలా తట్టుకుని నిలబడగలుగుతున్నారో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె స్పష్టంగా పంచుకున్నారు.

హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల...