భారతదేశం, ఏప్రిల్ 27 -- CNG cars under 10 Lakhs : దేశంలో పెట్రోల్ ధరల భారం పెరుగుతుండటంతో, మధ్యతరగతి వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ'లో సీఎన్జీ వేరియంట్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న టాటా నెక్సాన్ ఐసీఎన్జీ, మారుతీ సుజుకీ బ్రెజ్జా సీఎన్జీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీ ఎస్​యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ప్రస్తుతం మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (111 హెచ్​పీ), 1.2 లీటర్ టీజీడీఐ పెట్రోల్ (128 హెచ్​పీ), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ర...