భారతదేశం, జూలై 19 -- ప్రతీ యేటా ఆగస్ట్​ 15న, మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ తన కొత్త ప్రాడక్ట్​లను ప్రదర్శించడం ఆనవాయతీగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ తన ప్రాడక్ట్స్​తో రెడీ అవుతోంది. అయితే ఈసారి ఏకంగా మూడు రోజుల పాటు భారీ ఈవెంట్‌ను ప్లాన్ సంస్థ ప్లాన్ చేయడం విశేషం. ఈ వేదికపై పలు సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవ్వడంతో పాటు, భవిష్యత్తు మోడళ్లు తొలిసారి కస్టమర్ల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది!

రాబోయే మహీంద్రా మోడళ్లకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. అయితే ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆగస్టు 15 ఈవెంట్‌లో మనం ఏయే కార్లను ఆశించవచ్చో ఇప్పుడు చూద్దాము..

మహీంద్రా మార్కెట్లోకి తీసుకురానున్న సరికొత్త స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చే నెలలోనే అధికారికంగా అరంగేట్రం చేసే అ...