భారతదేశం, ఆగస్టు 5 -- దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'స్కార్పియో ఎన్' ఫేస్​లిఫ్ట్​ని తాజాగా లాంచ్​ చేసింది. మరింత అధునాతన సాంకేతికత, సరికొత్త ఫీచర్లతో ఈ బడా ఎస్​యూవీని అప్​డేట్ చేసింది. వినియోగదారుల ప్రీమియం అనుభవాన్ని, భద్రతను, ప్రయాణ సౌకర్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా ఈ కొత్త ఫీచర్లు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ 2026 మహీంద్రా స్కార్పియో ఎన్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్​లో ఈ అప్‌డేట్‌లో అత్యంత ముఖ్యమైనది 'పనోరమిక్ స్కైరూఫ్'! ఇప్పటివరకు ఉన్న సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ స్థానంలో, టాప్ వేరియంట్లలో ఈ పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించారు. దీనికితోడు కార్ పార్కింగ్, ఇరుకైన ప్రదేశాల్లో డ్రైవింగ్‌ను అత్యంత సులువుగా మార్చేందుకు 'బ్లైండ్ వ్యూ మానిటర్'త...