భారతదేశం, జూన్ 12 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న 'బిగ్ డాడీ ఆఫ్ ఎస్‌యూవీ' మహీంద్రా స్కార్పియో ఎన్.. సరికొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 2022లో మొదటిసారిగా విడుదలైన ఈ పవర్‌ఫుల్ లాడర్-ఫ్రేమ్ ఎస్‌యూవీ.. ఇప్పుడు మిడ్-సైకిల్ అప్‌డేట్ (ఫేస్‌లిఫ్ట్) వైపు అడుగులు వేస్తోంది.

ఇటీవల రాజస్థాన్‌లోని జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో ఈ సరికొత్త మోడల్‌ను తీవ్రమైన ఎండల్లో, విభిన్న రోడ్లపై మహీంద్రా సంస్థ టెస్టింగ్ చేస్తుండగా ఆటోమొబైల్ ప్రియుల కంట పడింది. ఈ స్పై చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

లీకైన వివరాల ప్రకారం.. రాబోయే స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో సరికొత్త డిజైన్ మార్పులు కనిపించనున్నాయి. మహీంద్రా గతేడాది ప్రదర...