భారతదేశం, మార్చి 11 -- భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. పరిమిత సంఖ్యలో విడుదల చేసిన 'బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్' కోసం భారతీయ వాహన ప్రియులు ఎగబడ్డారు. బుకింగ్ విండో తెరిచిన కేవలం ఏడు అంటే ఏడు నిమిషాల్లోనే.. కేటాయించిన 999 యూనిట్లు పూర్తిగా అమ్ముడయ్యాయని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

మహీంద్రా బీఈ 6కి సంబంధించి ఇది రెండో బ్యాచ్​! మొదటి బ్యాచ్​ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తొలుత చాలా తక్కువ యూనిట్​లనే సంస్థ అమ్మకానికి ఉంచింది. అవి నిమిషాల్లో సోల్డ్​ ఔట్​ అయిపోయాయి. డిమాండ్​ దృష్ట్యా 999 యూనిట్​లకు పెంచింది. అవి కూడా అమ్ముడుపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇప్పుడు రెండో బ్యాచ్​లోనూ కూడా అదే మ్యాజిక్​ కొనసాగుతుండటం విశేషం.

ఈ బ్యాట్‌...