భారతదేశం, మే 4 -- Mahesh Babu on Vijay: తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ప్రభంజనం సృష్టించింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులతో పాటు సినీ స్టార్లు సైతం స్పందిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్ వేదికగా తన మిత్రుడు విజయ్‌కు అభినందనలు తెలిపారు.

విజయ్ సాధించిన ఈ అసాధారణ గెలుపును ప్రశంసిస్తూ మహేష్ బాబు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తూ చారిత్రాత్మక విజయం అందుకున్న నా ప్రియ మిత్రుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. ఈ గెలుపు ప్రజలు నీపై ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్...