భారతదేశం, మార్చి 2 -- వారణాసి సినిమాలో తన కో స్టార్ ప్రియాంక చోప్రాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు. ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన 'ది బ్లఫ్' మూవీ రివ్యూను మహేష్ ఎక్స్ లో పంచుకున్నాడు. యాక్షన్ రోల్ లో ప్రియాంక చోప్రా అదరగొట్టిందని పేర్కొన్నాడు.

మహేష్ బాబు ది బ్లఫ్ రివ్యూ

డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' మూవీ చూసి మహేష్ బాబు ఇంప్రెస్ అయ్యాడు. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా యాక్టింగ్ కు ఫిదా అయ్యాడు. ఈ సినిమాపై తన రివ్యూను ఎక్స్ లో పంచుకున్నాడు.

"ఆకట్టుకునే యాక్షన్ & ఎమోషన్స్‌తో చక్కగా తెరకెక్కించిన సినిమా ది బ్లఫ్. ప్రియాంక చోప్రా అదరగొట్టింది. ఆత్మవిశ్వాసంతో చేసింది. అద్భుతమైన ప్రదర్శనతో అన్ని విధాలుగా సత్తాచాటింది. అమేజింగ్ గా పని చేసిన ఆ టీమ్ మొత్తానికి నా ప్రేమను పంపుతున్నా'' అని ఎక్స్ పోస్ట...