భారతదేశం, ఆగస్టు 24 -- Mahakali OTT: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ లేడీ సూపర్ హీరో మూవీ 'మహాకాళి' గ్లింప్స్ రిలీజ్ కాకముందే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈరోజు (ఆగస్టు 24) ఉదయం 11:34 గంటలకు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుండగా, ఆలోపే డిజిటల్ స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను మైండ్ బ్లాకింగ్ ధరకు దక్కించుకుంది. ప్రమోషన్లు పూర్తిస్థాయిలో మొదలుకాకముందే ఒక కొత్త కాన్సెప్ట్ సినిమాకు ఈ స్థాయిలో డిజిటల్ డీల్ కుదరడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

'హనుమాన్' (Hanu-Man) సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్ల సునామీ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమైన ప్రతీ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగ...