భారతదేశం, ఆగస్టు 19 -- Mahakali: 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. తన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' (PVCU)ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ యూనివర్స్ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి లేడీ సూపర్‌హీరో చిత్రం 'మహాకాళి' (Mahakali) గురించి మేకర్స్ ఒక ఆసక్తికరమైన తాజా అప్‌డేట్‌ను విడుదల చేశారు.

పూజా కొల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో కన్నడ నటి భూమి శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహాకాళి సినిమాకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అక్షయ్ ఖన్నాను చూపిస్తూ ఉన్న ఈ పోస్టర్‌పై "ది ఎండ్ బిగిన్స్" (The End Begins) అనే క్యాప్షన్‌...