భారతదేశం, మార్చి 28 -- 90వ దశకంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అండర్ వరల్డ్ నీడలో మగ్గిపోయేది. షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, కరణ్ జోహార్ వంటి హేమాహేమీలకు కూడా మాఫియా నుంచి బెదిరింపులు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ 'యువా' (Yuvaa) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబం ఎదుర్కొన్న ఒక భయానక, వింతైన అనుభవాన్ని పంచుకున్నారు. అండర్ వరల్డ్ బెదిరింపుల కారణంగా తమ ఇల్లు వదిలి ఒక రోజంతా వేరే చోట తలదాచుకోవాల్సి వచ్చిందని వరుణ్ ధావన్ పేర్కొన్నారు.

వరుణ్ ధావన్ ఆనాటి సంఘటనను వివరిస్తూ.. "అప్పట్లో చాలా మంది సెలబ్రిటీలకు మాఫియా కాల్స్ వచ్చేవి. మాకు కూడా చాలా కాలం నుంచి అలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయని మాకు తర్వాత తెలిసింది. ఎందుకంటే ఆ కాల్స్ ఎత్తిన మా ఇంట్లోని స్టాఫ్, అవతలి వ్యక్తి ఎవరన్నది తెలియక వారితో వాగ్వాదానికి దిగేవారు"...