భారతదేశం, మార్చి 12 -- పవన్ కల్యాణ్ ఓజీ మూవీతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న తమిళ నటి ప్రియాంకా అరుళ్ మోహన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'మేడ్ ఇన్ కొరియా' (Made in Korea) ఈ రోజే అంటే గురువారమే (మార్చి 12) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కించిన ఈ సినిమా.. భారతీయ నేపథ్యానికి కొరియన్ టేకింగ్‌ను జోడించి రూపొందించిన ఒక అరుదైన ఇండో-కొరియన్ మూవీ. ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే ఈ మూవీ చూడొచ్చు.

ఇండియాలో కొరియన్ డ్రామాలకు (K-Dramas) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకుడు రా కార్తీక్ అదే ట్రెండ్‌ను ఒడిసిపట్టారు. తమిళ సంస్కృతిని, కొరియన్ స్టోరీ టెల్లింగ్ మేళవించి ఈ మేడిన్ కొరియా సినిమాను రూపొందించాడు. కే-డ్రామాల్లో ఉండే ఆ విజువల్ రిథమ్, సున్ని...