భారతదేశం, జూన్ 4 -- Made In India Web Series Review: అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో తాజాగా వచ్చిన మేడిన్ ఇండియా: ఎ టైటన్ స్టోరీ వెబ్ సిరీస్ కేవలం ఓ బింజ్ వాచ్ చేసే సిరీసే కాదు.. ఓ బిజినెస్ లెసన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ బ్రాండ్ ను అసలు ఎలా క్రియేట్ చేస్తారు? దానిని ప్రపంచవ్యాప్తంగా ఎలా చేస్తారు? ఆ క్రమంలో వచ్చిన ఆటంకాలను ఎలా అధిగమిస్తారన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. టాటా నుంచి వచ్చిన టైటన్ వాచ్ ఓ పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించిందన్నదే ఈ వెబ్ సిరీస్ ప్రధాన కథాంశం.

1970ల చివరి రోజుల్లో టాటా గ్రూప్ ఎంప్లాయ్ జెర్సెస్ దేశాయ్ (జిమ్ సర్బ్) ప్రభుత్వ రంగ సంస్థలో కొన్ని ఏళ్లు పనిచేసి మళ్లీ మాతృసంస్థకు వస్తారు. ఆ టైమ్‌లో టాటా గ్రూప్ చైర్మన్, దిగ్గజం జేఆర్డీ టాటా (నసీరుద్దీన్ షా) ఒక ఫారిన్ వాచ్ మేకర్‌తో చేసిన మీటింగ్ జెర్సెస్ దేశాయ్‌ను ఆలోచనలో పడేస్...