భారతదేశం, నవంబర్ 11 -- Maatrubhumi Trailer: టైటిల్ మార్చుకొని, ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుందనే ప్రచారాన్ని దాటుకొని థియేటర్లకు వచ్చేందుకు సల్మాన్ ఖాన్ మాతృభూమి మూవీ రెడీ అవుతోంది. తెలంగాణ అమరవీరుడు, మహా వీర చక్ర సంతోష్ బాబు కథతో స్ఫూర్తి పొంది ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది.

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ట్రైలర్ రిలీజైంది. మంగళవారం (నవంబర్ 10) రాత్రి ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. భారత్-చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్.. యుద్ధం వల్ల కలిగే నష్టాలను, సైనికులు, వారి కుటుంబాల ఎమోషన్స్ ను కళ్లకు కట్టినట్లు చూపించింది. కేవలం శత్రువుల మీద పోరాటమే కాదు, శాంతిని నెలకొల్పడమే అసలైన దేశభక్తి అని ఈ ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు.

2020లో తూర్పు లద్ధాఖ్ ల...