భారతదేశం, అక్టోబర్ 12 -- Maatrubhumi: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'మాతృభూమి' (Matrubhoomi) మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. గత కొంతకాలంగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా చుట్టూ ఇప్పుడు కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా అనలిస్ట్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) ఈ సినిమా షూటింగ్ రీషూట్ వెనుక ఉన్న అసలు కారణాలంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఢిల్లీలో అక్టోబర్ 11న జరిగిన ఒక ప్రత్యేక ప్రెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. చైనాను వ్యతిరేకంగా చూపించే సన్నివేశాలను మార్చడం కోసమే ఈ సినిమాను బలవంతంగా రీషూట్ చేయించారంటూ ఆయన విమర్శించారు.

'మాతృభూమి - మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ప...