భారతదేశం, జూన్ 19 -- Maa Inti Bangaram Twitter Review: ఇప్పటివరకు సౌత్ స్క్రీన్స్‌పై గ్లామరస్, ఎమోషనల్, కల్ట్ పాత్రలతో మెప్పించిన సమంత.. మొదటిసారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ మసాలా కథతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన చిత్రం 'మా ఇంటి బంగారం'. తెలుగులో ఆమె కమ్ బ్యాక్ సినిమా అయిన మా ఇంటి బంగారం ఇవాళ (జూన్ 19) రిలీజైంది.

మూడేళ్ల తర్వాత సమంత తెలుగులో హీరోయిన్ మళ్లీ నటించిన మూవీ 'మా ఇంటి బంగారం'. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ సందర్భంగా శుక్రవారం ఉదయపు షోల నుంచే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మొదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు.

మా ఇంటి బంగారం మూవీ ట్విట్టర్ రివ్యూల ప్రకారం.. ఈ సినిమాను పూర్తిగా సమంత వన్ విమెన్ ఆర్మీలా నడిపించింది. సాధ...