భారతదేశం, జూన్ 20 -- Maa Inti Bangaram Manjusha: టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత రూత్ ప్రభు (Samantha), దర్శకురాలు బి.వి.నందిని రెడ్డిల క్రేజీ ప్రాజెక్ట్ 'మా ఇంటి బంగారం' థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 'ఓ బేబీ' వంటి మైల్‌స్టోన్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా కావడంతో ఆడియన్స్‌లో భారీ క్రేజ్ ఉంది. అయితే ఈ మూవీలో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ వైరల్ గా మారింది.

మా ఇంటి బంగారం సినిమాలో సమంత ఊరమాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఒక ఎత్తైతే.. కథలో ఆమె పక్కన ఉంటూ థియేటర్లలో క్లీన్ హ్యూమర్ పండించిన 'కిరణ్మయి' పాత్ర మరో ఎత్తు. సమంతకు బెస్ట్ ఫ్రెండ్‌గా ఈ పాత్రలో నటించిన ఆమె పేరు మంజూష ముక్కవిల్లి (Manjusha Mukkavilli). తన తొలి సినిమాలోనే నేచురల్ యాక్టింగ్‌తో ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మా ఇంటి బంగారం స...