భారతదేశం, ఏప్రిల్ 7 -- ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎం4ఎం (M4M - Motive for Murder)' చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "M4M (Motive for Murder)" పాన్ ఇండియా సినిమాగా ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది.

ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో నిర్మించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ (McWin Group USA) సహకారంతో ఎం4ఎం సినిమాను రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR Inox Pictures) సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది.

అమెరికాలో విడుదల బాధ్యతలను టెక్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (TekFlix Entertainment), నార్త్ ఇం...