భారతదేశం, సెప్టెంబర్ 5 -- Lust Stories 3 OTT: ఓటీటీని షేక్ చేసిన బోల్డ్ ఆంథాలజీ 'లస్ట్ స్టోరీస్' నుంచి మూడో సీజన్ వచ్చేస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ రిలీజ్ గా ఇది డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావ్, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ వంటి నలుగురు అగ్ర దర్శకులు మూడో సీజన్ ను తెరకెక్కించారు. ఇందులో రాధికా ఆప్టే, విజయ్ వర్మ, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ, కొంకణా సేన్ శర్మ తదితర స్టార్లు నటించారు.

ఆధునిక సంబంధాలు, మోహం, ఆకాంక్షలు, మానవ మనస్తత్వాలలోని క్లిష్టమైన ఎమోషన్లను ఆవిష్కరించడంలో 'లస్ట్ స్టోరీస్' ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ మూడో సీజన్‌ కోసం నలుగురు విభిన్న మేకింగ్ స్టైల్ ఉన్న దర్శకులు చేతులు కలిపారు.

బోల్డ్ అండ్ ఎమోషనల్ డ్రామా లస్ట్ స్టోరీస్ సీజన్ 3 మరింత స్పెషల్ గా మారింది. అందుకు కారణం ...