భారతదేశం, మార్చి 3 -- దేశంలో మధ్యాహ్నం 3.20 గంటలకు మెుదలైన చంద్రగ్రహణం ముగిసింది. సాయంత్రం 6.47కు గ్రహణం వీడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సైతం గ్రహణం చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు. అయితే కొంతమంది గ్రహణం సమయంలో సాయంత్రంపూట బయటకు ఎక్కువగా రాలేదు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చంద్రగ్రహణాన్ని 6.20 నుంచి గ్రహణం ముగిసే వరకు వీక్షించారు. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడనుందని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటుగా ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌, కాలిఫోర్నియాలో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనువిందు చేసింది.

ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం దాదాపు 3 గంటల 26 నిమిషాల పాటు కొనసాగింది....