భారతదేశం, అక్టోబర్ 30 -- సాధారణంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుడి నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఏజెంట్‌కు చెబితేనే సిలిండర్ అందజేస్తారు. అయితే అర్నబ్ తుపాను తీవ్రత కారణంగా ప్రభావిత జిల్లాల్లో మొబైల్ నెట్‌వర్క్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో వినియోగదారులకు ఓటీపీలు అందక, డెలివరీ ప్రక్రియ స్తంభించి వంటగ్యాస్ అందుబాటులో లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయాన్ని తక్షణమే గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. కేంద్ర చమురు మంత్రిత్వ శాఖతో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపింది. ప్రజల అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఓటీపీ నిబంధనను పక్కనబెట్టి నేరుగా డెలివరీ ఇచ్చేలా వెసులుబాటు కల్పించాలని కోరింది. ఏపీ ప్...