భారతదేశం, మార్చి 13 -- రాష్ట్రంలో LPG నిల్వలు, గ్యాస్ వినియోగదారులకు పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించి. పలు సూచనలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా, నిల్వలు, రవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ... రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజువారీ సమీక్ష, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు, డిస్ట్రిబ్యూటరీలు, ఎజెన్సీల దగ్గర పోలీస్ నిఘా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1...