భారతదేశం, ఆగస్టు 3 -- LPG Cylinder eKYC Telangana : గృహ వినియోగదారులకు సక్రమంగా గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు బోగస్, డూప్లికేట్, దీర్ఘకాలంగా వినియోగంలో లేని కనెక్షన్లను ఏరిపారేయడంపై చమురు కంపెనీలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే వినియోగదారుల ఆధార్, బయోమెట్రిక్ వివరాలను అనుసంధానిస్తూ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను విస్తృతంగా అమలు చేస్తున్నాయి.

గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16వ తేదీలోగా ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని చమురు సంస్థలు స్పష్టమైన నిబంధన విధించాయి. దీంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద, డెలివరీ బాయ్స్ వద్ద బయోమెట్రిక్ నమోదు కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే వాస్తవానికి గత నెలలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా.. చమురు కంపెనీలు ఈ నెల 16 వరకు గడువు పొడిగించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 70 శాతం వరకే ఈ-కేవైసీ పూర్...