భారతదేశం, అక్టోబర్ 12 -- Lokesh Kanagaraj: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్నట్లు ఎప్పుడో అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఊహించని వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని, లోకేష్ కనగరాజ్ చెప్పిన నెరేషన్ బన్నీకి నచ్చకపోవడంతో ఈ కాంబినేషన్ క్యాన్సిల్ అయిందంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇప్పటికే ఇతర దర్శకుల కథలు వినడం మొదలుపెట్టారని జోరుగా ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రచారానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌తో కలిసి తాను స్టోరీ డిస్కషన్స్‌లో ...