భారతదేశం, ఆగస్టు 6 -- Lock Up OTT: ఓటీటీలకు క్రేజ్ పెరుగుతున్నా కొద్దీ డిఫరెంట్ షోలు వస్తూనే ఉన్నాయి. అలా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'లాక్ అప్' రియాలిటీ షో ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఈ లాక్ అప్ సీజన్ లో ఫినాలే బుధవారం (ఆగస్టు 5) ముగిసింది. ఈ షోలో కంటెంట్ క్రియేటర్ శ్రేయ కల్రా విన్నర్ గా నిలిచింది.

ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరించిన ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో 'లాక్ అప్: సచ్ యా సజా' సీజన్ 2 (Lock Upp: Sach Ya Sazaa Season 2) గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ప్రారంభం నుంచి విపరీతమైన డ్రామా, గొడవలు, వివాదాలతో దాదాపు 50 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించిన ఈ షోలో కంటెంట్ క్రియేటర్, రియాలిటీ షో స్టార్ శ్రేయ కల్రా (Shreya Kalra) ట్రోఫీ దక్కించుకుంది.

లాక్ అప్ సీజన్ 2లో విన్నర్ గా నిలిచిన శ్రేయ క...