భారతదేశం, మే 23 -- భవిష్యత్తు కోసం మనం నిరంతరం పరిగెడుతుంటాం. ఒక లక్ష్యం కాగానే మరో లక్ష్యం.. ఒక ఉద్యోగం రాగానే, అంతకుమించిన పెద్ద పదవి.. వంద సంపాదించగానే వెయ్యి కోసం, వెయ్యి సంపాదించగానే లక్ష కోసం ప్రాకులాడుతంటాము. ఇదే జీవితం అనుకుంటాం. కానీ, ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి, "నిజంగా నేను బతుకుతున్నానా? లేక కేవలం శ్వాస తీసుకుంటున్నానా?" అని ఆలోచించారా?

మిచ్ ఆల్బోమ్ రాసిన అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ పుస్తకం "Tuesdays with Morrie" మనల్ని సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుతుంది. ఇది కేవలం ఒక కథ కాదు, ప్రాణాంతకమైన ఏఎల్ఎస్ (శ్వాస వ్యవస్థ, కండరాలను పూర్తిగా నిర్జీవం చేసే వ్యాధి) తో మరణ శయ్యపై ఉన్న ఒక వృద్ధ ప్రొఫెసర్ మోరీ స్క్వార్ట్​జ్​.. తన పాత స్టూడెంట్ మిచ్‌కు ప్రతి మంగళవారం బోధించిన జగమెరిగిన సత్యాల సంచయనం.

ఈ పుస్తకాన్ని మీరు ఎంపిక చేసుకోవడం మీకు మీరు ఇచ్చుక...