Life certificate : ఇంటి నుంచే పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ.. ఫోన్ ఉంటే చాలు!
భారతదేశం, నవంబర్ 1 -- రిటైర్మెంట్ తర్వాత ప్రతినెలా వచ్చే పింఛన్ కోసం ఎదురుచూసే వయోవృద్ధులకు, విశ్రాంత ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్త. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పరిధిలోకి వచ్చే పెన్షనర్లు ఇకపై తమ వార్షిక జీవిత ప్రమాణ పత్రాన్ని (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్- జీవన్ ప్రమాణ్) సమర్పించడానికి ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేవలం చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్ ఆథెంటికేషన్ సాంకేతికత ద్వారా నిమిషాల్లోనే ఇంటి వద్ద నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
కేంద్ర పింఛను, పెన్షనర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 1 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న '5వ జాతీయ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచారం'లో భాగంగా ఈ డిజిటల్ సేవలను ఈపీఎఫ్ఓ విస్తృతం చేస్తోంది.
వృద్ధాప్యం, అస్వస్థత లేదా సుదూర ప్రాంతాల్లో నివసించడం వల్ల ఏటా నవంబర్ నెలలో పెన్షన్ ఆఫీస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.