భారతదేశం, జూలై 8 -- Lenin Release: అక్కినేని అఖిల్ మోస్ట్ అవేటెడ్ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి కరెక్ట్ గా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా పెట్టిన లేటెస్ట్ ఎక్స్ పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. జులై 10న రాబోతున్న ఈ సినిమా కోసం ఇండియా వ్యాప్తంగా ఊహించని రేంజ్ లో స్పెషల్ ఎర్లీ మార్నింగ్ షోస్ ప్లాన్ చేసినట్లు ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

నిర్మాత నాగవంశీ తన ట్వీట్ లో.. "లెనిన్ మీ ముందుకు రావడానికి మరో రెండు రోజుల్లో సిద్ధంగా ఉంది. అవుట్ పుట్ మొత్తం చూశాక చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది. జులై 10న థియేటర్లలో ఎలాంటి మాస్ రాంపేజ్ ఉండబోతోందో మేము ఇప్పుడే ఫీల్ అవుతున్నాం" అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు....