భారతదేశం, జూలై 6 -- Lenin Jr NTR: 'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత సరైన కమ్‌బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న అక్కినేని అఖిల్ కు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ తోడయ్యారు. చిత్తూరు పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా 'లెనిన్' జులై 10, 2026 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ భారీ యాక్షన్ సినిమాకు నందమూరి తారక్ తన బేస్ వాయిస్ తో నెరేషన్ ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సెన్సేషన్ గా మారింది.

లెనిన్ మూవీ మేకర్స్ సోమవారం (జులై 6) రిలీజ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం టైటిల్ లోగో, ఒక భయంకరమైన పులి బొమ్మ మాత్రమే ఉన్న ఈ పోస్టర్ చూసి మొదట్లో ఫ్యాన్స్ కాస్త అయోమయానికి గురయ్యారు.

కానీ ఆ పులి మరెవరో కాదు కథను నెరేట్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని తెలియడంతో అక్కినేని, నందమూరి అభిమాన...