భారతదేశం, ఏప్రిల్ 24 -- ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో మరోసారి లేఆఫ్స్ ప్రకంపనలు భయపెడుతున్నాయి. ఒకవైపు ఏఐ (Artificial Intelligence) అద్భుతాలు చేస్తోందని మురిసిపోతున్న తరుణంలోనే, అదే ఏఐ వేలాది మంది ఉద్యోగాలను మింగేస్తోంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ) తన వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 10 శాతం మందిని, అంటే 8,000 మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. మరోవైపు, విండోస్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం తన అమెరికా సిబ్బందిలో 8,750 మందికి స్వచ్ఛంద విరమణ (Buyout) ఆఫర్లు ఇచ్చింది.

పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా వెల్లడించింది. కేవలం 8,000 మందిని తొలగించడమే కాకుండా, ఖాళీగా ఉన్న మరో 6,000 పోస్టులను కూడా భర్తీ చేయకూడదని సంస్థ నిర్ణయించుకుంది. మేనేజ్‌మెంట్ స్థాయిలో అనవసరపు పొరలను తగ్గించి, సాంకేతిక, ఇంజనీ...