భారతదేశం, అక్టోబర్ 22 -- Son Of Kanakadurgamma Laya Poster Release: తెలుగు డివోషనల్ కథలతో చాలా అరుదుగా సినిమాలు వస్తుంటాయి. భక్తి పారవశ్యంతో వచ్చే సినిమాల కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తుంటారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌లో ఓ విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రం పట్టాలెక్కింది.

సీనియర్ హీరోయిన్ లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ కనకదుర్గమ్మ'. దసరా పండుగ శుభ సమయాన్ని పురస్కరించుకుని సన్ ఆఫ్ కనకదుర్గమ్మ సినిమా నుంచి అత్యంత శక్తివంతమైన పోస్టర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్, స్వప్న దత్ ఈ ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్...