భారతదేశం, అక్టోబర్ 14 -- ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశం లభించింది. ఏయూ పరిధిలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లాలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను లా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అడ్మిషన్ల సంచాలకులు (Directorate of Admissions) ప్రకటన విడుదల చేశారు.

ఈ ప్రవేశాల ప్రక్రియ కింద ఐదేళ్ల ఎల్ఎల్‌బీ (5-Year LL.B.), మూడేళ్ల ఎల్ఎల్‌బీ (3-Year LL.B.), రెండేళ్ల ఎల్ఎల్‌ఎమ్ (2-Year LL.M.) సెల్ఫ్ సపోర్ట్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.

ఐదేళ్ల ఎల్ఎల్‌బీలో మొత్తం 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆర్థికంగా వెనకబడిన(ఈడబ్ల్యూఎస్) వర్గాల అభ్యర్థులకు 2 సీట్లు కేటాయించారు.

మూడేళ్ల ఎల్ఎల్‌బీలో మొత్తం 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా ఈడబ్ల్యూఎస్ కేటగి...